in

Konidela Sivasankara Varaprasad nu megastar ga marchina illu!

మెగాస్టార్ చిరంజీవి..ఈ సుదీర్ఘ ప్రయాణంలో కొణిదెల శివశంకర వరప్రసాద్ గా మొదలై చిరంజీవి, మెగా స్టార్ గా ఎదిగిన క్రమం ప్రతి ఒక్క కళాకారుడికి ఆదర్శప్రాయం. అలాగే మెగాస్టార్ చిరంజీవి తన జీవితంలో ఎన్నో మైలురాళ్లను దాటుకొని ఈ స్థాయికి చేరారు. ఐతే ప్రస్తుతం మెగాస్టార్ పేరు చెప్పగానే ఒక పెద్ద సినీ కుటుంబమే గుర్తుకొస్తోంది. తెలుగు సినిమా చరిత్రలోనే ఇంతలా కళామతల్లితో బంధం పెనవేసుకున్న కొద్దిపాటి కుటుంబాలలో మెగాస్టార్ కుటుంబం కూడా ఒకటి. ప్రస్తుతం చిరంజీవి కుటుంబానికి పెద్దపెద్ద బెంజ్ కార్లు, బంగ్లాలు తన కుటుంబం మొత్తానికి ఉండవచ్చు. కానీ ఆయన మాత్రం చిన్నతనం, యుక్త వయసులో ఎన్నో కష్టాలను అనుభవించాడు.

దానికి నిలువెత్తు నిదర్శనమే చిరంజీవి పుట్టి పెరిగిన నెల్లూరులోని ఆయన ఇల్లు..ఇప్పటికీ నెల్లూరు పట్టణంలో చెక్కుచెదరకుండా ఆనాటి జ్ఞాపకాలకు సజీవ సాక్షిగా ఈ ఇల్లును చూపించవచ్చు. చిరంజీవి తన విద్యాభ్యాసాన్ని అంతా కూడా ఇక్కడి నుంచే చేశాడు. ఈ ఇంటి నుంచే చిరంజీవి సినీ ప్రయాణం ప్రారంభమైంది. నెల్లూరు నుంచి కేవలం 176 కి.మీ.దూరంలో ఉన్న అలనాటి మద్రాస్ అంటే నేటి చెన్నైకి చిరంజీవి ఇంటి నుంచే వెళ్తూ వస్తూ ఉండేవాడు. ఒక విధంగా చెప్పాలంటే చిరంజీవికి సినిమాలపై ఆసక్తి కలగడానికి కూడా ఈ ఇల్లే కారణమని చెప్పవచ్చు.అలాగే చిరంజీవి కూడా తన ఉద్యోగ ప్రయత్నాల కోసం వెళ్లి, సినిమాల్లో తన ప్రయత్నాలు మొదలు పెట్టాడు. పునాది రాళ్లు సినిమా నుంచి ప్రయాణం మొదలుపెట్టి ఇప్పటి ‘విశ్వంభర’ వరకు ఆయన సినీ జీవితం ఎంతో సక్సెస్ ఫుల్ గా సాగింది..!!

Andrea Jeremiah SHOCKING Comments On Her Marriage!

Dulquer Salmaan onboard for Balakrishna’s next ?