in

keerthy suresh fixed for Vijay Deverakonda’s next!

విజయ్ దేవరకొండ అభిమానులకు ఎదురుచూపులు ముగిశాయి. తన తదుపరి చిత్రాన్ని ఆయన అధికారికంగా ప్రారంభించారు. కొంతకాలంగా వినిపిస్తున్న ఊహాగానాలకు తెరదించుతూ, ఈ సినిమాలో హీరోయిన్‌గా స్టార్ నటి కీర్తి సురేష్ దాదాపు ఖరారయ్యారు. హైదరాబాద్‌లో నిరాడంబరంగా జరిగిన ఈ సినిమా పూజా కార్యక్రమానికి కీర్తి సురేష్ హాజరు కావడంతో ఈ వార్తకు బలం చేకూరింది..

ఈవెంట్ నుంచి బయటకు వచ్చిన ఫోటో ఒకటి ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ‘రాజావారు రాణిగారు’ చిత్రంతో గుర్తింపు తెచ్చుకున్న యువ దర్శకుడు రవి కిరణ్ కోలా ఈ ప్రాజెక్ట్‌కు దర్శకత్వం వహిస్తుండగా, ప్రముఖ నిర్మాత దిల్ రాజు దీనిని నిర్మిస్తున్నారు. రాయలసీమ నేపథ్యంతో కూడిన పక్కా గ్రామీణ, మాస్ యాక్షన్ డ్రామాగా ఈ సినిమా తెరకెక్కనుంది. ఇప్పటికే విడుదల చేసిన “కత్తి నేనే.. నెత్తురు నాదే.. యుద్ధం నాతోనే..” అనే క్యాప్షన్‌తో ఉన్న ఫస్ట్ లుక్ పోస్టర్ సినిమాపై అంచనాలను భారీగా పెంచింది..!!

Salman Khan To Team Up With Telugu Director under dil raju?