దేవరతో ఎన్టీఆర్ సరసన తెలుగులో అరంగేట్రం చేసిన శ్రీదేవి కూతురు జాన్వీ కపూర్ తెలుగు ప్రేక్షకులకు దగ్గరైంది. ప్రస్తుతం వరుస సినిమాలతో అటు బాలీవుడ్, ఇటు బాలీవుడ్ లో బిజీ అవుతోంది..కాగా, ముంబైలో “సన్నీ సంస్కారీ కి తుల్సీ కుమారి” చిత్రానికి సంబందించిన ట్రైలర్‌ను గ్రాండ్‌గా లాంచ్ చేశారు. అక్టోబర్ 2, 2025న విడుదల కానున్న ఈ సినిమాలో వరుణ్ ధవన్, జాన్వీ కపూర్, సన్యా మల్హోత్రా, రోహిత్ సరాఫ్ ప్రధాన పాత్రల్లో నటిస్తున్నారు.
సినిమా కథ వెడ్డింగ్ చుట్టూ తిరుగుతున్నందున, ట్రైలర్ ఈవెంట్‌లో మీడియా ప్రతినిధులు జాన్వీని ఆమె పెళ్లి ప్లాన్స్ గురించి ప్రశ్నించారు. దీనికి జాన్వీ కపూర్ స్పందిస్తూ— “నా ప్లానింగ్ ఇప్పుడంతా సినిమాలపైనే ఉంది. పెళ్లి ప్లానింగ్‌కి ఇంకా చాలా సమయం ఉంది” అంటూ క్లారిటీ ఇచ్చారు. ఇటీవల శిఖర్ పహారియాతో జాన్వీ డేటింగ్‌లో ఉన్నారని వార్తలు వస్తున్నా, ఆమె మాత్రం ఈ విషయంపై పెద్దగా మాట్లాడటం లేదు. అయితే గతంలో ఇచ్చిన ఒక ఇంటర్వ్యూలో తాను తిరుపతిలో సింపుల్ వెడ్డింగ్ కావాలనే కోరికను వ్యక్తం చేసిన సంగతి తెలిసిందే..!!