
టాలీవుడ్ లో ఇప్పుడు ఓ కొత్త కాంబో వినిపిస్తోంది. శ్రీనువైట్ల దర్శకత్వంలో నితిన్ సినిమా చేస్తున్నాడని, మైత్రీ మూవీస్ ఈ సినిమాని నిర్మించబోతోందని టాకు. ఇది ఎంత వరకూ నిజమో తెలీదు కానీ, కాంబో పరంగా చాలా సర్ప్రైజ్ చేసిన ప్రాజెక్ట్ ఇది. ఎందుకంటే శ్రీనువైట్లకు హిట్లు లేవు. నితిన్ దీ అదే దారి. వీళ్లిద్దరూ కలిసి పని చేస్తున్నారంటే..మార్కెట్ లో ఆసక్తి ఎందుకు ఏర్పడుతుంది? ఈ ఇద్దరితో సినిమా చేయాలని మైత్రీకి ఎందుకు అనిపించింది? నిజంగానే ఈ ప్రాజెక్ట్ ఉంటుందా, ముందుకు వెళ్తుందా? అనే అనుమానాలు బోలెడన్ని. ఫ్లాపులో ఉన్న దర్శకుడు, హిట్ లేని హీరో సినిమాలు తీయకూడదని ఎక్కడా లేదు. ఏమో..గుర్రం ఎగరా వచ్చు. ఆ కాంబో హిట్ కొట్టావచ్చు. కాకపోతే మార్కెట్ సినారియో అలా లేదు. అంతా హిట్ వెనుకే పరుగులు పెడుతున్నారు..!!
