యంగ్ హీరో సిద్ధు జొన్నలగడ్డ కథానాయకుడిగా నటిస్తున్న తాజా చిత్రం ‘తెలుసు కదా’ షూటింగ్ చివరి అంకానికి చేరుకుంది. ఈ సినిమాలో నటిస్తున్న హీరోయిన్ రాశి ఖన్నా తన పాత్రకు సంబంధించిన చిత్రీకరణను తాజాగా పూర్తి చేసుకున్నారు. ఈ సందర్భంగా సినిమాతో తనకున్న అనుబంధాన్ని గుర్తుచేసుకుంటూ ఆమె సోషల్ మీడియాలో ఒక భావోద్వేగ పోస్ట్ పంచుకున్నారు..
“కెమెరాలు ఆగిపోయిన తర్వాత కూడా కొన్ని కథలు గుర్తుండిపోతాయి. ‘తెలుసు కదా’ అలాంటి కథే. ఈ సినిమా ప్రయాణం నాకు ఎంతో ప్రత్యేకం. ఈ జర్నీలో నాతో ఉన్న ప్రతి ఒక్కరికీ ధన్యవాదాలు. మేం సృష్టించిన ఈ ప్రపంచంలోకి మీరు అడుగుపెట్టే రోజు కోసం ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్నాను” అని రాశి ఖన్నా తన పోస్ట్‌లో పేర్కొన్నారు. ఆమె పోస్ట్‌తో సినిమాపై ప్రేక్షకుల్లో మరింత ఆసక్తి నెలకొంది..!!