సోమవారం కాజల్ రోడ్డు ప్రమాదంలో మరణించారంటూ సోషల్ మీడియాలో వార్తలు వేగంగా వ్యాపించాయి. దీనికి బలం చేకూరుస్తూ కొందరు ఆకతాయిలు నకిలీ వీడియోలను కూడా ప్రచారంలోకి తెచ్చారు. దీంతో కొందరు ఇది నిజమని నమ్మి, సోషల్ మీడియాలో సంతాప సందేశాలు కూడా పోస్ట్ చేయడం మొదలుపెట్టారు. ఈ ఫేక్ న్యూస్ తన దృష్టికి రావడంతో కాజల్ స్వయంగా తన సోషల్ మీడియా ఖాతా ద్వారా స్పందించారు.
“నాకు యాక్సిడెంట్ అయిందని, నేను ఇక లేనని కొన్ని నిరాధారమైన వార్తలు నా దృష్టికి వచ్చాయి. నిజానికి ఇది చాలా హాస్యాస్పదంగా ఉంది. ఎందుకంటే ఇందులో ఎలాంటి నిజం లేదు. దేవుడి దయ వల్ల నేను సంపూర్ణ ఆరోగ్యంతో, క్షేమంగా ఉన్నానని మీ అందరికీ తెలియజేస్తున్నాను. దయచేసి ఇలాంటి తప్పుడు వార్తలను నమ్మవద్దు, ప్రచారం చేయవద్దు. మనం సానుకూల దృక్పథంతో, నిజం వైపు ఉందాం” అని కాజల్ తన పోస్టులో పేర్కొన్నారు..!!