in

sreeleela picks her moments with telugu actors!

గపతి బాబు హోస్ట్‌గా చేసిన ఓ టీవీ షోలో హీరోయిన్ శ్రీలీల ఇచ్చిన సమాధానాలు వినోదంగా, హృద్యంగా మారాయి. ఒకేసారి రామ్ చరణ్, జూనియర్ ఎన్టీఆర్ సినిమాలకు డేట్స్ అడిగితే ఎవరిని ఎంచుకుంటావని జగపతి బాబు ప్రశ్నించగా, శ్రీలీల వెంటనే నవ్వుతూ, “ఆ ఇద్దరి హీరోలతో అయితే డే నైట్ షిఫ్ట్‌లలో పనిచేసి అయినా ఇద్దరి సినిమాల్లో చేస్తాను” అని చెప్పింది. ఈ జవాబు విన్న వెంటనే ప్రేక్షకులందరూ చప్పట్లు కొట్టారు.

అలాగే రవితేజ, మహేష్ బాబు సెట్‌లో ఎవరితో ఎక్కువ అల్లరి జరుగుతుందని అడిగితే, “ఇద్దరూ చేస్తారు. మాస్ జాతరలో రవితేజతో బాగా ఎంజాయ్ చేశాను. మహేష్ బాబు పంచ్‌లు వేరే లెవెల్‌లో ఉంటాయి, ఎవరినీ వదలరు” అని చెప్పి మరోసారి నవ్వులు పూయించింది. హీరోయిన్‌లలో మంచి డాన్సర్ ఎవరని అడగగా, “ఒకప్పుడు రాధా, ఇప్పుడు సాయి పల్లవి” అని చెప్పింది. దీనిపై జగపతి బాబు సరదాగా, “ఇది సమంతకు చెప్పుదాం, ఒకసారి ఫోన్ చేద్దాం” అని వ్యాఖ్యానించగా, శ్రీలీల వెంటనే “సమంత నా ఫేవరెట్ యాక్ట్రెస్” అని జవాబిచ్చింది..!!

Anushka Shetty to skip ‘ghaati’ promotions, confirms producer!