రష్మిక మందన ఇటీవల ఒక ఇంటర్వ్యూలో మాట్లాడుతూ..తన మనసులోని బాధను బయటపెట్టారు. తనపై జరుగుతున్న ట్రోల్స్ గురించి మాట్లాడుతూ..”నాపై డబ్బులు ఇచ్చి ట్రోల్స్ చేయించారు. నా గురించి నెగటివ్ విషయాలు ప్రచారం చేశారు. నేను ఆ పరిస్థితిని ఎదుర్కొన్నాను” అని అన్నారు. ఇలాంటి చర్యలు తనను చాలా బాధించాయని ఆమె చెప్పారు. నేను ఒక భావోద్వేగ జీవిని. నేను ఎలా ఉన్నానో అలాగే ఉండాలనుకుంటున్నాను..
కానీ నా భావోద్వేగాలను బయటపెట్టడానికి నేను ఇష్టపడను. ఎందుకంటే, ఈ మధ్య కాలంలో ప్రేమగా ఉండడాన్ని కూడా బలహీనతగా చూస్తున్నారు. కెమెరా కోసం రష్మిక ఇలా నటిస్తుంది అని చెబుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. మీరు ప్రేమ, దయ చూపలేకపోతే సైలెంటుగా ఉండండి. ఈ ప్రపంచంలో అందరూ ఎదగడానికి చాలా స్థలం ఉంది. ఒకరు ఎదుగుతుంటే ఎందుకు ఆపాలని చూస్తున్నారు? ప్రజలు ఎందుకు ఇలా క్రూరంగా ప్రవర్తిస్తున్నారో నాకు అర్థం కావడం లేదు. ఇది చాలా బాధాకరమైన విషయమని తన ఆవేదనను వెళ్లగక్కారు..!!