in

kushboo reveals about not taking any hormone injections!

టీవల ఖుష్బూ ఆకుపచ్చ రంగు సీక్విన్ డ్రెస్‌లో మెరిసిపోతున్న తన ఫొటోలను సోషల్ మీడియాలో పంచుకున్నారు. ఈ ఫొటోలు చూసిన అభిమానులు ఆమె ట్రాన్స్‌ఫర్మేషన్‌పై ప్రశంసలు కురిపించారు. ఇదే క్రమంలో ఓ నెటిజన్, “ఇదంతా మౌంజారో ఇంజెక్షన్ మహిమ. ఈ విషయం మీ ఫాలోవర్లకు కూడా చెప్పండి. వాళ్లు కూడా తీసుకుంటారు” అని కామెంట్ చేశారు. దీనిపై ఘాటుగా స్పందించిన ఖుష్బూ, తన బరువు తగ్గడం వెనుక ఎలాంటి మందులు గానీ, ఇంజెక్షన్లు గానీ లేవని తేల్చిచెప్పారు..

క్రమశిక్షణ, నిలకడ, సంకల్పంతోనే తాను బరువు తగ్గానని, అడ్డదారులను నమ్మవద్దని సూచించారు. తన ఫిట్‌నెస్ ప్రయాణం గురించి ఖుష్బూ వివరిస్తూ, “ప్రతిరోజూ ఉదయం గంటపాటు వర్కవుట్ చేస్తాను. సాయంత్రం 45-50 నిమిషాలు నడుస్తాను. ఒకవేళ సాయంత్రం నడక కుదరకపోతే, ఉదయం గంట, సాయంత్రం గంట చొప్పున వర్కవుట్ చేస్తాను” అని తెలిపారు. సరైన ఆహార నియమాలు పాటించడం కూడా తన విజయానికి ఒక కారణమని ఆమె పేర్కొన్నారు..!!

radika apte reveals producer wasn’t happy about her pregnancy!