in

radika apte reveals producer wasn’t happy about her pregnancy!

2015లో వచ్చిన ‘లయన్’ సినిమా తర్వాత ఆమె టాలీవుడ్ కు డూరమయ్యారు. అయితే బాలీవుడ్ లో మాత్రం ఆమె బిజీగానే ఉంటున్నారు. 2012లో బ్రిటీష్ సంగీత దర్శకుడు బెనెడిక్ట్ టేలర్ ను ఆమె పెళ్లాడారు. పెళ్లయిన పదేళ్లకు ఆమె తల్లి అయ్యారు. గత ఏడాది డిసెంబర్ లో ఆమె బిడ్డకు జన్మనిచ్చారు. తాజాగా ఓ ఇంటర్వ్యూలో ఆమె మాట్లాడుతూ ఒక చేదు అనుభవాన్ని పంచుకున్నారు. తాను గర్భవతి అయిన తర్వాత తొలి మూడు నెలలు దారుణంగా గడిచాయని ఆమె తెలిపారు. ఓ సినిమా సందర్భంగా నరకం అనుభవించానని చెప్పారు.

తాను బిగుతైన దుస్తులు ధరించకూడదని చెప్పినా వినకుండా, వాటిని వేసుకోవాల్సిందేనని నిర్మాత పట్టుబట్టాడని తెలిపారు. తన పరిస్థితిని అర్థం చేసుకోలేదని..సెట్ లో నొప్పిగా ఉందని చెప్పినా  వైద్యుడిని కలిసేందుకు అనుమతించలేదని ఆవేదన వ్యక్తం చేశారు. ఇది తనకు ఎంతో బాధను కలిగించిన విషయమని చెప్పారు. వృత్తి పరంగా తాను ఎంతో ప్రొఫెషనల్ గా, ఎంతో నిజాయతీగా ఉంటానని..కానీ, ఇలాంటి సమయంలో కొంత మానవత్వం, సానుభూతి అవసరమని ఆమె అన్నారు..!!

Shruti Haasan reveals about her dream role!