in

Venky Atluri confirms sequel to Dulquer Salmaan’s ‘Lucky Bhaskar’!

వెంకీ అట్లూరి – దుల్కర్ సల్మాన్ కాంబినేషన్లో వచ్చిన చిత్రం లక్కీ భాస్కర్. ఈ సినిమా ఎలాంటి అంచనాలు లేకుండా థియేటర్లలో రిలీజ్ అయ్యి సూపర్ హిట్ చిత్రంగా నిలిచిన సంగతి తెలిసిందే. ఈ సినిమాలో మీనాక్షి చౌదరి హీరోయిన్ గా నటించింది. ఈ సినిమా ప్రేక్షకులను ఎంతగానో ఆకట్టుకుంది. మధ్యతరగతి కుటుంబంలో ఉండే కష్టాలు సంతోషాలను ఈ సినిమాలో చాలా చక్కగా చూపించారు డైరెక్టర్ వెంకీ అట్లూరి..

ఆ తర్వాత హీరో ఎదిగే విధానం, డబ్బు సంపాదించే సీక్రెట్ ప్రతి ఒక్కరిని ఎంతగానో ఆకట్టుకుంది. కాగా ఈ సినిమా విడుదలై దాదాపు సంవత్సరం అయిపోయింది. ఈ సినిమాకు సీక్వెల్ ఉంటుందని డైరెక్టర్ వెంకీ తాజాగా ఓ ఇంటర్వ్యూలో భాగంగా వెల్లడించారు. ధనుష్ తో తాను తీసిన ‘సార్’ సినిమాకు మాత్రం సీక్వెల్ లేదని వెల్లడించారు. కాగా గత సంవత్సరం ఓటీటీలో రిలీజ్ అయిన లక్కీ భాస్కర్ సినిమా 100 కోట్లకు పైగా కలెక్షన్లను రాబట్టింది..!!

manchu manoj about nepotism and easy cinema entry!