in

Nani to team up again with ‘Hi Nanna’ director Shouryuv again!

న్యాచురల్ స్టార్ నాని సినిమాల సెలక్షన్ గురించి తెలిసిందే. ప్రస్తుతం టాలీవుడ్ లో వరుస హిట్లతో దూసుకెళ్తున్న స్టార్స్ లో నాని ఒకరు. యాక్టర్ గానే కాదు నిర్మాతగా కూడా నాని తన మార్క్ సినిమాలు చేస్తూ అలరిస్తున్నారు. నిర్మాతగా కోర్ట్ హిట్ అందుకున్న నాని హీరో కమ్ ప్రొడ్యూసర్ గా చేసిన హిట్ 3 తో మరో బంపర్ హిట్ కొట్టాడు. ప్రస్తుతం నాని శ్రీకాంత్ ఓదెల తో ప్యారడైజ్ సినిమా చేస్తున్నాడు. ఈ సినిమాను 2026 మార్చి ఎండింగ్ రిలీజ్ లాక్ చేశారు. ఈ సినిమా తర్వాత నాని సుజిత్ డైరెక్షన్ లో ఒక సినిమా చేయనున్నాడు. ఆ మూవీ కూడా ఈ ఇయర్ ఎండింగ్ లో సెట్స్ మీదకు వెళ్తుందని తెలుస్తుంది.

ఐతే నాని తో హిట్ కొట్టిన డైరెక్టర్స్ మళ్లీ అతనితోనే సినిమాలు చేయాలని చూస్తున్నారు. దసరా తో మాస్ హిట్ కొట్టిన శ్రీకాంత్ ఓదెల ప్యారడైజ్ అంటూ మళ్లీ నానితోనే ప్రాజెక్ట్ చేస్తున్నాడు. ఇదే క్రమంలో నానితో హాయ్ నాన్న అనే సినిమా చేసి సక్సెస్ అందుకున్న డైరెక్టర్ శౌర్యువ్ కూడా నానితో మరో సినిమా ప్లానింగ్ లో ఉన్నాడట. ఆల్రెడీ నానికి కథ చెప్పడం నాని ఇంప్రెస్ అవ్వడం జరిగిందట. ఈ సినిమాను నాని మేనేజర్ వెంకట రత్నం ఈ సినిమాను నిర్మిస్తారని తెలుస్తుంది. నానికి కొన్నాళ్లుగా మేనేజర్ గా ఉంటూ కెరీర్ కి సపోర్ట్ చేస్తూ వచ్చాడు. ఇప్పుడు ఆయన నిర్మాతగా నాని సినిమా రాబోతుందని తెలుస్తుంది. ఈ సినిమాకు సంబంధించిన అఫీషియల్ డీటైల్స్ త్వరలో తెలుస్తాయి..!!

Keerthy Suresh Breaks Silence On Equal remunerations!