in

VV Vinayak’s comeback film with this young hero?

ప్పుడు ఆయన మళ్లీ ప్రయత్నాలు ప్రారంభించారని తెలుస్తోంది. ఒక నిర్మాతను కూడా సిద్ధం చేసుకున్నారట. కథలు సిద్ధంగా ఉంచుకొని హీరో కోసం ప్రయత్నిస్తున్నారు. స్టార్ హీరోలు ప్రస్తుతం వినాయక్‌ను పట్టించుకునే పరిస్థితిలో లేరని టాక్. బాలకృష్ణ, వెంకటేష్‌లను సంప్రదించినా అవకాశం కలగలేదని వినిపిస్తోంది. దీంతో ప్రస్తుతం యువ హీరో సిద్ధు జొన్నలగడ్డ‌ను టార్గెట్ చేశారట.

కానీ సిద్ధు ఇప్పటికే బొమ్మరిల్లు భాస్కర్‌తో చేసిన జాక్ సినిమా అపజయం అందుకున్న నేపథ్యంలో మరో సీనియర్ డైరెక్టర్ ప్రయోగం చేయడానికి వెనకడుగు వేయవచ్చనే అభిప్రాయం ఉంది. ఇక ప్రస్తుతం యువ హీరోలు విభిన్న కథలు, వినూత్న ప్రెజెంటేషన్ కోరుకుంటున్నారు. అలాంటప్పుడు ఓ ఫెయిల్యూర్ లో ఉన్న దర్శకుడితో ఛాన్స్ ఇవ్వాలనుకోవడం కష్టం. ఫాన్స్ మాత్రం వినాయక్ రీ ఎంట్రీ తో ఓ మాస్ మేజిక్ చేస్తే చూడాలని ఎదురుచూస్తున్నారు. కానీ ప్రస్తుతం చూస్తే వినాయక్ రీఎంట్రీ ప్లాన్స్ కు సమయం అనుకూలించేలా కనిపించడం లేదు. మరి అతని ప్రణాళికలు ఏ విధంగా ఉంటాయో చూడాలి..!!

 

Janhvi Kapoor VS Mrunal Thakur media attention!

Nayanthara Hits Back At Trolls Over Telugu Film Promotions!