in

Janhvi Kapoor VS Mrunal Thakur media attention!

ప్రముఖ నటి మృణాల్ ఠాకూర్ ప్రతి ఒక్కరికి సుపరిచితమే. ఈ భామ ప్రస్తుతం తెలుగు సినీ పరిశ్రమలో తన సినిమాలతో ప్రేక్షకులను ఎంతగానో అలరిస్తోంది. తాజాగా మృణాల్ ఠాకూర్ ఓ అవార్డు కార్యక్రమంలో పాల్గొన్నారు. అక్కడికి మృణాల్ ఠాకూర్ చేరుకోగానే తన చుట్టూ చాలా మంది మీడియా ప్రతినిధులు వచ్చి అనేక రకాల ప్రశ్నలు అడిగారు. వాటన్నింటికీ మృణాల్ ఠాకూర్ చాలా ఓపికగా సమాధానం ఇచ్చారు..

ఆ సమయంలో అక్కడికి శ్రీదేవి వారసురాలు జాన్వి కపూర్ రాగానే తన చుట్టూ ఉన్న వారంతా జాన్వి కపూర్ వద్దకి పరుగులు తీసుకుంటూ వెళ్లారట. ఆ సమయంలో తనకు ఎంతగానో బాధగా అనిపించిందని మృణాల్ ఠాకూర్ పేర్కొన్నారు. సినీ పరిశ్రమలో వారసత్వానికి ఉన్నంత ప్రాధాన్యత కష్టపడి పైకి వచ్చిన వారికి లేదంటూ మృణాల్ ఠాకూర్ ఎమోషనల్ అయ్యారు. ప్రస్తుతం మృణాల్ ఠాకూర్ షేర్ చేసుకున్న ఈ విషయాలు సోషల్ మీడియా మాధ్యమాల్లో వైరల్ అవుతుంది. తాను ఇలా మాట్లాడడంపై జాన్వి కపూర్ అభిమానులు ఫైర్ అవుతున్నారు..!!

Triptii Dimri secured her biggest fee for prabhas spirit!

VV Vinayak’s comeback film with this young hero?