క్రికెటర్ యుజ్వేంద్ర చహల్ మాజీ భార్య, డ్యాన్సర్, కొరియోగ్రాఫర్, నటి ధనశ్రీ వర్మ ఇప్పుడు దక్షిణాది సినీ పరిశ్రమ, ముఖ్యంగా టాలీవుడ్లో తన అదృష్టాన్ని పరీక్షించుకోవడానికి సిద్ధమయ్యారు. ‘ఆకాశం దాటి వస్తావా’ అనే తెలుగు చిత్రంతో ఆమె వెండితెర అరంగేట్రం చేయనున్నారు. తన బహుముఖ ప్రతిభతో ‘టింగ్ లింగ్ సజనా’ వంటి పలు విజయవంతమైన మ్యూజిక్ వీడియోలలో మెరిసిన ధనశ్రీ, నటనను కూడా తన కెరీర్లో భాగంగా చేసుకుంటున్నారు.
ఇటీవల ఒక ప్రముఖ ఆంగ్ల మీడియాకు ఇచ్చిన ఇంటర్వ్యూలో ధనశ్రీ తన కెరీర్, వ్యక్తిగత జీవితంపై వస్తున్న వదంతుల గురించి స్పందించారు. “నా వ్యక్తిగత జీవితంపై వస్తున్న ఊహాగానాలను నేను ఏమాత్రం పట్టించుకోను. నా చుట్టూ ప్రచారంలో ఉన్న కథనాలకు, వాస్తవానికి ఎలాంటి సంబంధం లేదు. నా విలువలు, పెంపకం నాకు తెలుసు. గౌరవం, హుందాతనాన్ని కాపాడుకోవడమే నా నైజం,” అని ఆమె స్పష్టం చేశారు..!!