బాలీవుడ్ నటి భూమి పెడ్నేకర్ తాజాగా యువ నటుడు ఇషాన్ ఖత్తర్ తో కలిసి నటించిన ‘ది రాయల్స్’ వెబ్ సిరీస్ హాట్ టాపిక్‌గా మారింది. ఈ సిరీస్‌లో ఇద్దరి మధ్య ఇంటిమేట్ సీన్స్‌పై నెటిజన్ల కామెంట్లు తెగ వైరల్ అవుతున్నాయి. ఈ వెబ్‌సిరీస్‌లో తన కన్నా ఆరేళ్ల చిన్నవాడైన ఇషాన్ ఖత్తర్‌తో రొమాన్స్ చేయడం ఎలా అనిపించింది? అనే ప్రశ్నకు భూమి పెడ్నేకర్ స్పందిస్తూ — “ఇంటిమేట్ సీన్స్ చేయడం అనేది చిన్న విషయం కాదు..
ఆ సన్నివేశాల్లో కంఫర్ట్ ఫీలయ్యేలా ఇద్దరం ముందే బంధం పెంచుకున్నాం. ఇషాన్‌కి నేను కంఫర్ట్‌గా ఫీలయ్యాను కాబట్టి ఆ సీన్స్ నేచురల్‌గా వచ్చాయి” అంటూ చెప్పింది. భూమి పెడ్నేకర్ (34), ఇషాన్ ఖత్తర్ (28) మధ్య దాదాపు 6 ఏళ్ల వయసు తేడా ఉన్నా, స్క్రీన్‌పై ఇద్దరూ రొమాంటిక్ సీన్స్‌తో ఇరగదీశారని నెటిజన్లు సోషల్ మీడియాలో కామెంట్లు చేస్తున్నారు. ఇప్పటికే ఈ సిరీస్ ట్రైలర్, సీన్స్ క్లిప్స్ నెట్టింట వైరల్ అవుతూ ట్రెండింగ్‌లో ఉన్నాయి..!!