in

actress Sonali Bendre’s Triumph Over Cancer!

కప్పుడు హిట్‌ సినిమాలతో ప్రేక్షకులను మెప్పించిన బాలీవుడ్ నటి సోనాలి బింద్రే, కొన్నేళ్ల క్రితం తీవ్రమైన ఆరోగ్య సమస్యను ఎదుర్కొన్న సంగతి తెలిసిందే. 2018లో ఆమెకు మెటాస్టాటిక్ క్యాన్సర్ నిర్ధారణ కావడంతో, తానే స్వయంగా ఈ విషయం గురించి వెల్లడించారు. ఆ సమయంలో ఆమె చూపిన ధైర్యం, ఆత్మస్థైర్యం చాలా మందికి ఆదర్శంగా నిలిచింది..

తాజాగా ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న సోనాలి, తన ఆరోగ్య స్థితిని ఎందుకు స్వయంగా వెల్లడించాల్సి వచ్చిందో స్పష్టం చేశారు. సోనాలి బింద్రే, క్యాన్సర్‌ను జయించిన తర్వాత ఈ వ్యాధిపై ప్రజల్లో అవగాహన క‌ల్పిస్తున్నారు. ‘‘క్యాన్సర్ అనేది జీవితాన్ని రెండు భాగాలుగా విభజిస్తుంది – ఒకటి ముందటి జీవితం, రెండు తర్వాతి జీవితం. ఇది నాకు ఎన్నో జీవిత పాఠాలు నేర్పింది. మన జీవితం ఏ పరిస్థితుల్లోనైనా ఆగకూడదు. ట్రీట్‌మెంట్ రోజులు నా జీవితంలోని అత్యంత కఠినమైన దశగా మిగిలిపోయాయి’’ అని ఆమె గతంలో కూడా పేర్కొన్నారు..!!

keerthy suresh focused only on bollywood now?

Bhumi Pednekar On Doing Steamy Scenes with Ishaan Khatter!