in

flop heroine bhagyashree borse becomes the busiest heroine now!

వితేజ హీరోగా నటించిన మిస్టర్ బచ్చన్ సినిమాతో టాలీవుడ్ ఎంట్రీ ఇచ్చిన భాగ్యశ్రీ బోర్సే..ఈ సినిమాతో ఎలాంటి రిజల్ట్ అందుకుందో తెలిసిందే. రవితేజ కెరీర్‌లోనే అతిపెద్ద డిజాస్టర్‌గా ఈ సినిమా నిలిచింది. ఇలాంటి క్రమంలో రిజల్ట్‌తో సంబంధం లేకుండా..భాగ్యశ్రీ వరుస సినిమాల్లో అవకాశాలు కొట్టేసింది. దుల్కర్ సల్మాన్ హీరోగా నటిస్తున్న కాంత సినిమాలో నటిస్తోంది. మరోపక్క విజయ్ దేవరకొండ కింగ్డమ్ సినిమాలోను ఈ అమ్మడు మెరువనున్న సంగతి తెలిసిందే..

ఇలా దుల్కర్, విజయ్‌లకు జంటగా భాగ్యశ్రీ నటిస్తున్న ఈ రెండు సినిమాలపై ఆడియన్స్ లో మంచి అంచనాలు నెలకొన్నాయి. ఇక ఈ సినిమాలు ఇంకా రిలీజ్ కూడా కాకముందే ఎనర్జిటిక్ స్టార్ రామ్ 22వ సినిమాలో హీరోయిన్గా ఛాన్స్ కొట్టేసింది. ఈ మూడు సినిమాలు సక్సెస్ అయితే మాత్రం అమ్మడి వేగానికి అడ్డుకట్ట వేయడం కష్టమే. కెరీర్‌లో ఒక్క హిట్ కూడా లేకుండానే ఈ రేంజ్ లో స్టార్ హీరోల సినిమాలు అవకాశాలు కొట్టేసిందంటే..అమ్మడి క్రేజ్ ఏంటో అర్థం చేసుకోవచ్చు..!!

Rashmika Resumes her work For horror comedy film!

ram charan to remake pawan kalyan’s hit song for ‘peddi’?