టాలీవుడ్ యంగ్ హీరో రామ్ పోతినేని, నటి భాగ్యశ్రీ బోర్సే మధ్య ప్రేమ వ్యవహారం నడుస్తోందని, వారికి రహస్యంగా నిశ్చితార్థం కూడా జరిగిపోయిందని గత కొద్ది రోజులుగా సోషల్ మీడియాలో వార్తలు హల్ చల్ చేస్తున్నాయి. ఈ ఊహాగానాలపై నటి భాగ్యశ్రీ బోర్సే తాజాగా స్పష్టతనిచ్చారు. వీరిద్దరూ ప్రస్తుతం కలిసి ఓ సినిమాలో నటిస్తున్న నేపథ్యంలో ఈ వార్తలు ప్రాధాన్యత సంతరించుకున్నాయి..
సోషల్ మీడియాలో చురుగ్గా ఉండే భాగ్యశ్రీ, ఇటీవల ఇన్ స్టాగ్రామ్ వేదికగా అభిమానులతో ముచ్చటించారు. ఈ సందర్భంగా ఓ నెటిజన్, “మీ చేతికి ఉన్న ఉంగరం ఎవరు తొడిగారు?” అని ఆమెను ప్రశ్నించారు. దీనికి బదులిస్తూ, “ఆ ఉంగరం నాకు ఎవరూ తొడగలేదు, నేనే కొనుక్కున్నాను” అని భాగ్యశ్రీ బదులిచ్చారు. దీంతో ఆమె ఎంగేజ్‌మెంట్ వార్తల్లో ఎటువంటి నిజం లేదని పరోక్షంగా వెల్లడించారు. భాగ్యశ్రీ ఇచ్చిన ఈ సమాధానంతో, వారిద్దరి రిలేషన్ షిప్ పై వస్తున్న వదంతుల్లో వాస్తవం లేదని స్పష్టమైంది..!!