in

Prabhas Joins Hands With Prasanth Varma For movie On Bakasura?

సినిమా టైటిల్ కూడా కథకు తగిన విధంగా ఉండాలనే కసితో దర్శక నిర్మాతలు వినూత్నమైన పేర్లను ఎంచుకుంటున్నారు. తాజాగా, పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ ఓ మైథలాజికల్ మూవీ కోసం సిద్ధమవుతున్నట్లు సమాచారం. ఈ చిత్రానికి ‘బకా’ (BAKA) అనే పవర్‌ఫుల్ టైటిల్‌ను పరిశీలిస్తున్నారు. ఈ ప్రతిష్టాత్మక ప్రాజెక్ట్‌కు దర్శకుడు మరెవరో కాదు, ‘హనుమాన్’ చిత్రంతో సెన్సేషన్ క్రియేట్ చేసిన ప్రశాంత్ వర్మ. మైత్రి మూవీ మేకర్స్ బ్యానర్‌పై భారీ బడ్జెట్‌తో రూపొందనున్న ఈ సినిమా, మహాభారతంలోని బకాసురుడి ఇతిహాసాన్ని ఆధారంగా చేసుకుని తెరకెక్కనుందని టాక్..

తాజా సమాచారం ప్రకారం, మేకర్స్ కథకు అనుగుణంగా ‘బకా’ అనే టైటిల్‌ను ఫిక్స్ చేయాలని నిర్ణయించుకున్నట్టు తెలుస్తోంది. ఇప్పటివరకు వచ్చిన మైథలాజికల్ మూవీలకు పూర్తిగా భిన్నంగా ఉండే ఈ సినిమా అత్యంత గ్రాండ్‌గా రూపొందనుందని సినీ వర్గాలు అంచనా. ఇదివరకే ప్రశాంత్ వర్మ..రణవీర్ సింగ్‌తో ఈ ప్రాజెక్ట్‌ను ప్లాన్ చేసినప్పుడు, దీనికి ‘బ్రహ్మ రాక్షస’ అనే టైటిల్ అనుకున్నారని, కానీ ఇప్పుడు ప్రభాస్ ఎంట్రీతో టైటిల్‌ను ‘బకా’గా మార్చినట్లు టాలీవుడ్ వర్గాల్లో చర్చ జరుగుతోంది..!!

42 years for ‘Kaliyuga Ramudu’!

telugu tamil malayalam hindi, sai pallavi is everywhere!