నటన పరంగానే కాదు..డాన్స్ పరంగా కూడా సాయిపల్లవి నెక్స్ట్ లెవెల్లో కనిపిస్తుంది. మలయాళ, తమిళ, తెలుగు సినిమాల మీదుగా ఆమె ప్రయాణం బాలీవుడ్ వరకూ వెళ్లింది. సాయిపల్లవి ఉంటే ఆ ప్రాజెక్టు క్రేజ్, మార్కెట్ పెరగడానికి ఎక్కువ సమయం పట్టడం లేదు. ఇక అది లేడీ ఓరియెంటెడ్ కథ అయితే ప్రత్యేకించి చెప్పవలసిన పనేలేదు. అందువల్లనే సాయిపల్లవి కోసం ఇప్పుడు చాలామంది మేకర్స్ వెయిట్ చేస్తున్నట్టు టాక్..
సాయిపల్లవి చేసే సినిమాలలో సహజంగానే ఆమె పాత్రకి ప్రాధాన్యత ఉంటుంది. ఇక నాయిక ప్రధానమైన పాత్రలలో ఆమె మరింత జీవిస్తుంది. ఎంతటి బలమైన కథనైనా ఆడియన్స్ వరకూ తీసుకుని వెళ్లగలిగే సత్తా ఆమెకి ఉంది. అందువలన చాలామంది మేకర్స్ ఆమెను దృష్టిలో పెట్టుకుని కథలను తయారుచేసుకుంటున్నారు. ఆ కథలను ఆమెకు వినిపించడం కోసం గట్టిగానే ట్రై చేస్తున్నారట. ఒకేసారి ఇన్ని భాషల నుంచి ఇంతటి క్రేజ్ ను..డిమాండ్ ను తెచ్చుకోవడం నిజంగా గొప్ప విషయమే..!!