అల్లు అర్జున్ – అట్లీ కాంబినేషన్ లో సినిమా
పుష్ప 2 మూవీకి సుమారు 500 కోట్లు బడ్జెట్ పెడితే 1900 కోట్లు వసూల్ చేసింది. పుష్ప 2 మూవీతో బన్నీ మార్కెట్ అమాంతం పెరిగింది. అట్లీ బాలీవుడ్ డెబ్యూ జవాన్ కూడా 1000 కోట్ల క్లబ్ లో చేరింది. వేలల్లో మార్కెట్ ఉన్నబన్నీ – అట్లీ కాంబో అంటే ఇక చెప్పేదేం లేదు రఫా రఫా కోతే. అందుకే అట్లీ బన్నీ కాంబో మూవీకి బడ్జెట్ కూడా భారీగానే ఉంది. ఈ మూవీ కోసం సుమారు 600 కోట్ల బడ్జెట్ ఫిక్స్ చేసినట్లు సమాచారం..
ఒక్క సినిమాకు అల్లు అర్జున్ 250 కోట్లు రెమ్యునరేషన్
బన్నీ మార్కెట్ ని దృష్టిలో పెట్టుకునే ఇంత బడ్జెట్ పెడుతున్నట్లు తెలుస్తోంది..ఈ బడ్జెట్ లో సగం కేవలం బన్నీ, అట్లీ పేమెంట్ ఉందని టాక్. ఈ సినిమా కోసం అల్లు అర్జున్ 250 కోట్లు రెమ్యునరేషన్ తీసుకుంటున్నట్లు తెలుస్తోంది. ఇదే నిజమైతే ప్రభాస్ ని బన్నీ అధిగమించినట్లే. ఇప్పటివరకు హయ్యెస్ట్ పెయిడ్ యాక్టర్ గా ప్రభాస్ ఉండేవాడు. ఇప్పుడు ఆ లిస్ట్ లో బన్నీ చేరాడు. అట్లీ కూడా ఈ మూవీ కోసం 100 కోట్లు డిమాండ్ చేస్తున్నట్లు సమాచారం. ఇలా వీరిద్దరి పేమెంట్ కే సగం బడ్జెట్ ఖతం..!!