in

Bollywood star urvashi raut to join Jr NTR’s Dragon

లు అందాల పోటీల్లో కిరీటాలు గెల్చుకున్న హాట్ బ్యూటీ ‘ఊర్వశీ రౌటేలా’ ఇప్పుడిప్పుడే  టాలీవుడ్ లో బిజీగా మారబోతోంది. ఇన్నాళ్లు ఐటెం గర్ల్ గా ఉన్న ఊర్వశి కి ఇప్పుడు బంపర్ అఫర్ వచ్చింది. మొదట మోడలింగ్ తో కెరియర్ మొదలు పెట్టిన ఊర్వశి, తరువాత టాలీవుడ్ లో ఐటెం గర్ల్ అవతారం ఎత్తింది. ఒక్కో మెట్టు ఎక్కుతూ ఇప్పుడు హీరోయిన్ ఛాన్స్ లు అందుకుంటోంది. ఇప్పుడు ఎన్టీఆర్ – ప్రశాంత్ నీల్ కాంబో మూవీ డ్రాగన్ లో కూడా ఊర్వశి పేరు వినిపిస్తోంది..

నిన్న మొన్నటి వరకు ఊర్వశి డ్రాగన్ లో ఎన్టీఆర్ తో కలిసి ఐటెం సాంగ్ చేస్తోంది అనుకున్నారు. కానీ లేటెస్ట్ అప్డేట్ ప్రకారం డ్రాగన్ లో ఊర్వశి ఒక కీలక పాత్రలో కనిపిస్తోంది అని సమాచారం. ప్రశాంత్ నీల్ సినిమాలో ప్రతి పాత్రకి కథలో ఇంపార్టెన్స్ ఉంటుంది. కొన్ని పాత్రలు చాలా పవర్ ఫుల్ గా ఉంటాయి. డ్రాగన్ లో ఊర్వశి చేసే పాత్ర కూడా అలాంటిదే అని సమాచారం. సో ఇక నుంచి ఊర్వశి కేవలం ఐటెం గర్ల్ గానే కాకుండా నటనకి ఆస్కారమున్న పాత్రల్లో కూడా నటిస్తుంది..!!

vijay devarakonda ‘Pelli Choopulu 2’ on the cards?