రజనీకాంత్ చాలా సింపుల్ గా బ్రతికే మనిషి. ఆయన జీవితంలో కొన్ని రికార్డ్స్ ఎంతగానో బ్రేక్ చేశాయి. 1978లో రజనీకాంత్ నటించిన 20 సినిమాలు రిలీజ్ అయ్యాయి. ఆయన మాతృభాష మరాఠీ అయినప్పటికీ కూడా..ఇంతవరకు రజనీకాంత్ మరాఠీ భాషలో ఒక సినిమా కూడా నటించలేదు. దానధర్మాలను, దైవభక్తిని నమ్మే గొప్ప వ్యక్తి ఆయన. ఆయన సంపాదనలో 50% దానధర్మాలకు ఖర్చు పెడతాడని అంటారు. సేవా కార్యక్రమాలను చేస్తాడంట..రజనీకాంత్ ఎంతో సామాన్యంగా బ్రతికే మనిషి..ఆయన చిరునవ్వులతో ముఖాన్ని నింపుతూ అందరిని పలకరించే గొప్ప వ్యక్తిత్వం ఉన్న మనిషి..
ఎవరికి సినీ నటులకు దక్కని ఒక అదృష్టం రజనీకాంత్ కి దక్కింది. అదేంటంటే..CBSE ఆరో తరగతి పుస్తకాల కోర్స్ లో..ఏకైక ఇండియన్ నటుడు రజినీకాంత్ గురించి ఒక పాఠం ఉంటుంది. ఫ్రొం బస్ కండక్టర్ టు ఫిలిం స్టార్ పేరుతో విద్యార్థులకు రజనీకాంత్ జీవితాన్ని పాఠంగా ఉంది. నిజంగా ఆయన ఎంత అదృష్టవంతులు కాపోతే పిల్లలు అలా చదువుకుంటారు ఆయన గురించి. అలాగే ఆయన జీవితంలో చివరిగా..హిమాలయాలకు వెళ్లిపోయి అక్కడ సెటిల్ అవ్వాలని ఆయన చిరకాల కోరిక అంట. అక్కడ ఉన్న ప్రశాంతత ఇంకెక్కడ దొరకదని ఆయన ఉద్దేశం అంట..!!