in

Vijay Deverakonda to Lead British Era-Set Historical Film!

విభిన్న కథతో విజయ్‌ దేవరకొండ
బ్రిటిష్ కాలం కథతో విజయ్‌ దేవరకొండ ఓ సినిమా చేస్తున్నాడు. గత కొంత కాలంగా ఫ్యామిలీ స్టోరీ, లవ్‌స్టోరీ, స్పోర్ట్స్‌ బ్యాక్‌డ్రాప్‌ కథలతో సినిమాలు చేసిన విజయ్‌ సరైన విజయాన్ని దక్కించుకోలేక పోయాడు. ‘గీత గోవిందం‘ సక్సెస్‌ తరువాత ఆయన మరో సరైన కమర్షియల్‌ విజయం కోసం ఎదురుచూస్తున్నాడు. అందుకే ఇక రెగ్యులర్‌ కథలకు స్వస్తి చెప్పి విభిన్న కథలను ఎంచుకుంటున్నాడు. ప్రస్తుతం విజయ్‌ దేవరకొండజెర్సీ‘ ఫేమ్‌ గౌతమ్‌ తిన్ననూరి దర్శకత్వంలో ఓ సినిమా చేస్తున్నాడు.

బ్రిటీష్‌ కాలం నేపథ్యంలో విజయ్‌ దేవరకొండ సినిమా
వేసవిలో ఆ చిత్రం ప్రేక్షకుల ముందుకు రానుంది. ఇక దీంతో పాటు ‘టాక్సీవాలా‘ ఫేమ్‌ రాహుల్‌ సంకృత్యన్‌ డైరెక్షన్‌లో ఓ సినిమా చేయడానికి అంగీకరించాడు. ఈ చిత్రం షూటింగ్‌ త్వరలోనే ప్రారంభం కానుంది. బ్రిటీష్‌ కాలం నేపథ్యంలో పీరియాడిక్‌ యాక్షన్‌ డ్రామాగా ఈ చిత్రం తెరకెక్కనుందట. 19వ సెంచరీ నేపథ్యంతో 1854 నుంచి 1878 మధ్య కాలంలో జరిగిన యదార్థ చారిత్రక సంఘటనల ఆధారంగా ఈ సినిమా ఉంటుంది. ఈ బ్యాక్‌ డ్రాప్‌లో వచ్చిన ఏ సినిమాలో చూపించని అంశాలతో ఈ సినిమా ఉంటుందని చెబుతోంది చిత్ర యూనిట్‌..!!

Devi SreePrasad replacing AR Rahman for RC 16?

malayalam beauty Samyuktha Menon to Romance Balakrishna!