రష్మిక వరుస సినిమాలతో దూసుకుపోతోంది. ఇటు టాలీవుడ్ అటు బాలీవుడ్‌లో వరుస ఆఫర్స్ తో సత్తా చాటుతుంది. ఇప్పుడు చేతినిండా సినిమాలతో నాన్ స్టాప్ షూటింగ్స్‌తో క్షణం తీరిక లేకుండా గడుపుతోంది. అందులో ఒకటి ఛావా. తాజాగా ఈ సినిమా నుంచి రష్మిక లుక్ పోస్టర్‌ను మేకర్స్ విడుదల చేశారు. ప్రతి రాజు వెనుక అసమానమైన బలం కలిగిన రాణి ఉంటుంది. స్వరాజ్యం గర్వపడే మహారాణి ఏసుబాయి అంటూ రష్మిక పాత్రను రివీల్ చేశారు. ఇందులో రష్మిక ఛత్రపతి శివాజీ సతీమణి మహారాణి ఏసుబాయి పాత్రలో కనిపించనున్నారు.
ఇందులో పట్టుచీరకట్టులో ఒంటినిండా ఆభరణాలతో మహారాణి రాజసం ఉట్టిపడేలా కనిపించింది రష్మిక. ఓ పోస్టర్ లో ఆమె చిరునవ్వుతో కనిపించగా..మరో పోస్టర్ లో గంభీరంగా కనిపిస్తుంది. ప్రస్తుతం ఈ రెండు పోస్టర్లు సోషల్ మీడియాలో వైరలవుతున్నాయి. ఇక రష్మిక మందన్న ఇన్‌స్టాలో పోస్ట్ చేసి ప్రతి గొప్ప రాజు వెనుకాల యోధురాలైన భార్య ఉంటుందని కామెంట్ జతచేశారు. ఈ లుక్ లో రష్మిక మందన్న అప్పటి కాలంలో రాణుల్లా కాస్ట్యూమ్స్ వేసుకుని అందంగా కన్పిస్తున్నారు. ఇప్పటివరకు సింపుల్ గా నవ్వుతూ అల్లరి పిల్లలా కనిపించిన రష్మిక లుక్ చూసి అభిమానులు ఫిదా అవుతున్నారు..!!