తెలుగులో బుజ్జిగాడు సినిమాతో ఆకట్టుకున్న ఈ ముద్దుగుమ్మ..తర్వాత అడపా దడపా సినిమాల్లో కనిపించింది. అయితే ఇక్కడ ఊహించిన రేంజ్లో సక్సెస్ రాకపోవడంతో..కన్నడ ఇండస్ట్రీలో అవకాశాలు అందుకుంది. అక్కడ తన నటనతో మంచి ఇమేజ్ను క్రియేట్ చేసుకుంది. కాగా మంచి ఫామ్లో ఉన్న సమయంలో..డ్రగ్స్ కేసులో ఈమె ఆరోపణలు ఎదుర్కోవడం..జైలు జీవితాన్ని అనుభవించడంతో అందరూ షాక్ అయ్యారు..
సంజన బెయిల్ పై బయటకు వచ్చి ఒక ముస్లిం డాక్టర్ని వివాహం చేసుకున్నారు. అయితే ఆమె లవ్ జిహాది బాధితురాలని అప్పట్లో చర్చలు కూడా వైరల్ అయ్యాయి. కాగా గతంలో ఓ తెలుగు ఇంటర్వ్యూలో పాల్గొన సంజన గల్రాన్ని ఓ కన్నడ స్టార్ హీరోపై షాకింగ్ కామెంట్స్ చేశారు. ప్రస్తుతం ఆ కామెంట్స్ మరోసారి వైరల్ గా మారాయి. గతంలో కన్నడ సినిమాలో నటించే సమయంలో ఒక కన్నడ హీరో తనని చాలా టార్చర్ చేశాడు అంటూ వివరించిన సంజనా..ఆ హీరో ప్రెస్టేజ్ ఉన్న హీరో అని..అతని పేరు చెప్పను కానీ అతనితో సినిమాలో నటించా అంటూ వివరించింది..!!