in

why did balakrishna not acted with Sridevi ?

1974 లో బాలకృష్ణ బాలనటుడి గా సినిమాలు చేయడం ప్రారంభించారు. “తాతమ్మ కల” సినిమా తో బాలకృష్ణ తెలుగు తెర కు పరిచయం అయ్యారు. ఆ తరువాత భలే దొంగ, మంగమ్మ గారి మనుమడు, రామ్ రహీమ్, అన్నదమ్ముల బంధం, ముద్దుల మావయ్య, ముద్దుల కృష్ణుడు వంటి సినిమాల్లో కనిపించారు. శ్రీదేవి హీరోయిన్ గా అయిన తరువాత వెంకటేష్, చిరంజీవి, నాగార్జున వంటి హీరోలందరితో కలిసి నటించింది కానీ బాలకృష్ణ తో మాత్రం శ్రీదేవి ఒక్క సినిమా కూడా చేయలేదు. దీనికి కారణం ఏంటనే విషయమై పలు రూమర్లు చక్కర్లు కొడుతున్నాయి..

వాస్తవానికి వీరిద్దరి కాంబినేషన్ లో రెండు సినిమాలు రావాల్సి ఉంది..1987 లో దర్శకేంద్రుడు రాఘవేంద్ర రావు వీరిద్దరి కాంబినేషన్ లో “సామ్రాట్” అనే సినిమా ను అనౌన్స్ చేసారు. ఆ తరువాత 1989 లో కోదండరామిరెడ్డి దర్శకత్వం లో “భలేదొంగ” సినిమా లో కూడా శ్రీదేవి నే హీరోయిన్ గా తీసుకోవాలనుకున్నారు. అయితే, శ్రీదేవి హిందీ సినిమాలతో వరుస ఆఫర్లతో బిజీ అయిపోయారు. దీనితో, బాల కృష్ణతో ఒప్పుకున్నా సినిమాల నుంచి తప్పుకోవాల్సి వచ్చింది. రౌడీ రాముడు, కొంటె కృష్ణుడు సినిమా లోను, అనురాగ దేవత అనే సినిమాలో కూడా వీరిద్దరూ ఒక ఫ్రేమ్ లో కనిపించారు. కానీ, బాల కృష్ణ, శ్రీదేవి జంట గా మాత్రం ఎపుడు కనిపించలేదు..!!

after chiru anil ravipudi to direct king nagarjuna?