సోషల్ మీడియాలో మాత్రం ఎప్పటికప్పుడు తన హెల్త్ అప్డేట్స్ గురించి తను పర్సనల్ విషయాలను గురించి తన ఫ్యాన్స్ కి ఎప్పటికప్పుడు అప్డేట్స్ ఇస్తూ ఉంటుంది. అయితే సమంత ఈమధ్య కెరియర్ పరంగా దూకుడు పెంచింది. హాలీవుడ్, బాలీవుడ్ సిరీస్ లతో తెగ హంగామా చేస్తుంది. ఇటీవల విడుదలైన సిటాడెల్: హనీ బన్నీ సాధించిన ఘన విజయం సంగతి అందరికీ తెలిసిందే.
ఇక తాజాగా ఆమె మరొకసారి యాక్షన్ సిరీస్ తో ముందుకు రావడానికి సిద్ధమవుతోంది. తుంబార్డ్ ఫేమ్ రాహి అనిల్ బార్వే దర్శకత్వంలో రక్త్ బ్రహ్మాండ్ పేరుతో ఒక వెబ్ సిరీస్ తెరకెక్కిస్తున్న విషయం తెలిసిందే. ఈ సిరీస్ లో ఆదిత్య రాయ్ కపూర్, సమంత ప్రధాన పాత్రలో పోషిస్తున్నారు. ఒక చక్రవర్తి మరణం తర్వాత ఖాళీగా ఉన్న సింహాసనం కోసం పోటీ పడుతున్న ఇద్దరు యువరాజుల కథ ఈ సిరీస్. తాజాగా ఈ ఫాంటసీ వరల్డ్ షూటింగ్ లోకి అడుగుపెట్టినట్లు సమంత ప్రకటించింది..!!