బాక్స్ ఆఫీస్ పై పుష్ప దండయాత్ర
అల్లు అర్జున్ ‘పుష్ప 2: ది రూల్’ సినిమా టికెట్ బుకింగ్స్‌లో రికార్డు సృష్టించింది. ఇప్పటికే ఆన్లైన్ బుకింగ్ యాప్ ‘బుక్ మై షో‘లో అత్యంత వేగంగా 10 లక్షల టిక్కెట్ బుకింగ్స్ అయ్యాయి. అంతేగాక ఈ సినిమా తొలిరోజు రూ.50 కోట్ల కలెక్షన్ల మార్కును కూడా దాటేసింది. Sacnilk తాజా గణాంకాల ప్రకారం పుష్ప2 మొదటి రోజు ఇప్పటికే రూ. 50 కోట్లు రాబట్టింది..
కల్కి, KGF రికార్డు బ్రేక్ చేసిన అల్లు అర్జున్
ఇందులో వివిధ భాషలలో ఇండియా వ్యాప్తంగా 21,000 షోల ద్వారా వచ్చిన రూ. 35.75 కోట్ల నికర వసూళ్లు ఉన్నాయి. ఇక పుష్ప 2 థియేట్రికల్ విడుదలకు ఇంకా రెండు రోజులు మాత్రమే ఉంది. ఈ చిత్రం డిసెంబర్ 5న ప్రేక్షకుల ముందుకు రానున్న విషయం తెలిసిందే. అయితే, విడుదలకు ముందే ఈ చిత్రం ప్రతి రోజు కొత్త రికార్డులను సృష్టిస్తోంది..!!