in

akkineni Akhil signs 2 new projects at a time!

హీరో నటించిన గత సినిమా ‘ఏజెంట్‌’ బిగ్గెస్ట్‌ డిజాస్టర్‌గా నిలిచింది. ఈ సినిమా విడుదలై ఏడాదిన్నర గడుస్తున్నా అఖిల్‌ మరో చిత్రం అంగీకరించలేదు. గత కొంతకాలం నుండి ఎన్నో కథలను వింటున్నా ఈ కథానాయకుడు ఏ చిత్రానికి గ్రీన్‌ సిగ్నల్‌ ఇవ్వలేదు. తాజాగా ఈ అక్కినేని వారసుడు రెండు చిత్రాల్లో నటించడానికి పచ్చజెండా ఊపాడట. వచ్చే ఏడాది ప్రారంభంలో ఈ రెండు చిత్రాలు సెట్స్‌ మీదకు వెళ్లబోతున్నాయని తెలిసింది.

అందులో ఒకటి యూవీ క్రియేషన్స్‌ సంస్థ నిర్మించబోయే ‘ధీర’ చిత్రం కూడా వుంది. అనిల్‌ ఈ చిత్రం ద్వారా దర్శకుడిగా పరిచయం కాబోతున్నాడు. దీంతో పాటు తమ సొంత నిర్మాణ సంస్థ అన్నపూర్ణ స్టూడియోస్‌ బ్యానర్‌లో కూడా ఓ సినిమా అఖిల్ చేయనున్నాడు. ఈ చిత్రానికి ‘వినరో భాగ్యం విష్ణు కథ’ దర్శకుడు మురళీ కిషోర్‌ అబ్బూరు దర్శకుడు. ఈ రెండు సినిమాలు కూడా ఏకకాలంలోనే చిత్రీకరణ చేయాలని ప్లాన్‌ చేస్తున్నారు మేకర్స్‌…!!

Mrunal Thakur gets a crazy offer from kollywood!

another top heroine in ram charan Buchi Babu Sana film?