in

devara producer Naga Vamsi Responds on song trolls!

రీసెంట్‌గా దేవర నుండి రెండో పాటను విడుద‌ల చేయ‌గా, ఈ రొమాంటిక్ సాంగ్ ఆకట్టుకుంది. ఈ సాంగ్ లిరిక్స్ కైపెక్కిస్తున్నాయి. చుట్టమల్లే చుట్టేస్తోంది..అంటూ సాగె ఈ పాటలో జాన్వీ ఎన్టీఆర్ మధ్య కెమిస్ట్రీ చాలా అద్భుతంగా ఉంది. రామజోగయ్య శాస్త్రి అందించిన సాహిత్యం, అనిరుద్ మ్యూజిక్, శిల్పా మధురమైన గాత్రం పాటకు ప్రాణం పోశాయి అని చెప్పాలి. అయితే కొంద‌రు మాత్రం ఈ పాట‌ని దారుణంగా ట్రోల్ చేస్తున్నారు.ఈ పాట సోప్ యాడ్ ని తలపిస్తుందని , వాటిని సంబంధించిన సీన్స్ క‌ట్ చేసి మీమ్స్ చేస్తూ ఎద్దేవా చేస్తున్నారు. ఎడిటింగ్ వీడియోలతో సోషల్ మీడియాను హోరెత్తిస్తున్నారు.

దీనిపై నిర్మాత నాగ వంశీ స్పందిస్తూ గ‌త 24 గంట‌లుగా చుట్ట‌మ‌ల్లే పాటపై ట్రోల్స్ వ‌స్తున్నాయి.ఇందులో తార‌క్ అన్న‌ని చూస్తుంటే ముచ్చ‌టేస్తుంది. జాన్వీని చూస్తుంటే ముద్దొస్తుంది.ఇంక ఎవ‌రు ఏమ‌నుకుంటే మ‌న‌కేంటి, దేనితో పోల్చుకుంటే మ‌న‌కేంటి క‌దా బాయ్స్ అని కామెంట్ పెట్టాడు. కాగా ఈ పాటకు బాస్కో మార్టిస్ అందించిన కొరియోగ్ర‌ఫీ బాగుంది. ట్యూన్స్ మాత్రం అనిరుధ్..శ్రీలంక ఫేమస్ సాంగ్ అయిన యొహిని పాడిన “మనికే మాగే హితే” పాటను కాపీ చేసాడని ట్రోల్స్ వచ్చాయి. దేవ‌ర రెండో సాంగ్‌ విడుదలైన 24 గంటల్లో యూట్యూబ్ లో తెలుగు వెర్షన్ కి సంబంధించి 15.68 మిలియన్ల వ్యూస్ వచ్చాయి..!!

prabhas to romance trisha again?

Massive update on Jr NTR and Prashanth Neel Upcoming Movie!