in

samantha says no to sister kind of roles!

యాసైటీస్ కారణంగా వన్ ఇయర్ సినిమాలకి బ్రేక్ ఇచ్చి, పూర్తి ఫిట్ గా తయారయ్యి ఇప్పుడు రీఎంట్రీ కి సిద్దమయ్యింది సామ్. ఈ క్రమంలో  ఓ వైపు వెబ్ సిరీస్, ఇంకో వైపు లేడి ఓరియెంటెడ్ సినిమాలు చేస్తూ, తెలుగు, తమిళం, హిందీ, మలయాళం సినిమాల్లో ఆఫర్స్ అందుకొంటోంది. ఎంతో ఉత్సాహంగా రీ ఎంట్రీ కి సిద్దమైన సామ్ కి ఒక చేదు అనుభవం ఎదురైనట్లు టాక్. అన్ని భాషల్లో సినిమాలు చేస్తున్నా, ఇప్పటివరకు సీనియర్ హీరోలతో నటించలేదు అలాంటిది ఏకంగా వదిన పాత్రకి సామ్ ని సంప్రదించారని టాక్.

టాలీవుడ్ లో ప్రముఖ బ్యానర్, బడా హీరో సినిమాలో సమంత కి వదిన పాత్ర ని ఆఫర్ చేసారని, ఆ హీరో తో సామ్ ఇంతకముందు జోడి గా నటించిందని సమాచారం. ఈ ప్రపోజల్ విన్న సామ్ అదిరిపడి ‘నేనా..అప్పుడే వదిన పాత్రా’ అన్నదట. లేడీ ఓరియంటెడ్ మూవీస్, సిరీస్ లు చేసుకుంటా, అవి కూడా లేకపోతె ఖాళీగా ఉంటా కానీ వదిన, అక్కా లాంటి పాత్రాలు ఇప్పట్లో చేయనని ఖరాకండీగా చెప్పేసిందట..!!

kriti sanon in dating UK-based businessman Kabir Bahia?

Anushka Shetty makes a sudden social media post!