రవితేజ హీరోగా ‘మిస్టర్ బచ్చన్’ సినిమాలో లిరికల్ సాంగ్ వచ్చినప్పటి నుంచి దాని మీద జరుగుతున్న చర్చ అంతా ఇంతా కాదు. ముందు రవితేజ, హీరోయిన్ భాగ్యశ్రీ బోర్సే మధ్య వయసు వ్యత్యాసం గురించి కొన్ని మీమ్స్ వచ్చాయి. ఇతని కన్నా సీనియర్ స్టార్లు సగం కంటే తక్కువ ఏజ్ ఉన్న వాళ్ళతో ఆడిపాడినప్పుడు రాని అభ్యంతరం కేవలం తమ హీరో చేస్తున్నప్పుడు మాత్రమే కనిపిస్తున్నాయా అంటూ ఫ్యాన్స్ రివర్స్ కౌంటర్లు వేశారు. ధమాకా టైంలోనూ ఇలాంటివి జరిగాయి. శ్రీలీల జోడి గురించి వచ్చిన కామెంట్స్ రిలీజయ్యాక ఆగిపోవడం మర్చిపోయేది కాదు.
ఈసారి రవితేజతో పాటు దర్శకుడు హరీష్ శంకర్ ని కొందరు లక్ష్యంగా పెట్టుకున్న వైనం సోషల్ మీడియాలో కనిపిస్తోంది. పాటలో భాగ్యశ్రీ మొహం కన్నా ఆమె శరీరాన్నే ఎక్కువ హైలైట్ చేశారంటూ ఒక స్టెప్పుని పదే పదే రిపీట్ మోడ్ లో చూపిస్తూ ఆయనేదో గతంలో ఎవరూ చేయించని ఎక్స్ పోజింగ్ చూపించారనే రేంజ్ లో కామెంట్స్ పెట్టారు. ఆధునిక రాఘవేంద్రరావు అంటూ కితాబు ఇస్తున్న వాళ్ళు లేకపోలేదు. అయితే కేవలం మిస్టర్ బచ్చన్ మాత్రమే వీళ్లకు ఎందుకు కనిపిస్తోందనేది వేయి డాలర్ల ప్రశ్న..!!