in

KGF Beauty srinidhi shetty Into nani’s ’Hit’ Series!

KGF బ్యూటీ శ్రీనిధి శెట్టి గురించి ప్రత్యేకంగా పరిచయం అక్కర్లేదు. కన్నడ ఇండస్ట్రీకి చెందిన ఈ భామ కెజిఎఫ్ అనే ఒక్క సినిమాతో పాన్ ఇండియా వైడ్ గా క్రేజ్ సంపాదించుకుంది. తాజాగా వచ్చిన సమాచారం ప్రకారం శ్రీనిధి శెట్టి తెలుగులో త్వరలో నాని హీరోగా తెరకెక్కుతున్న సినిమాకు హీరోయిన్ గా సైన్ చేసిందని సమాచారం. శైలేష్ కొలను త్వరలో హిట్ యూనివర్స్ లో భాగంగా హిట్3 సినిమాని చేయనున్నాడన్న సంగతి తెలిసిందే..

ఇప్పుడు HIT3 సినిమాలో శ్రీనిధి శెట్టి హీరోయిన్ గా నటిస్తుందని తాజాగా వార్తలు వస్తున్నాయి. రీసెంట్ గా శైలేష్ కొలను కథ వినిపించగా, వెంటనే శ్రీనిధి ఒకే చెప్పేసిందని సమాచారం. ఇదిలా ఉండగా ఇప్పటికే రానా రాక్షస రాజు అనే సినిమాలో హీరోయిన్ గా నటిస్తుందని తెలిసందే. అలాగే సిద్ధు జొన్నలగడ్డ యొక్క ‘తెలుసు కథ’ సినిమాలో కూడా శ్రీనిధియే హీరోయిన్ అని సమాచారం. కానీ ఈ సినిమాలో ఎప్పుడు రిలీజ్ అవుతాయో చెప్పలేని పరిస్థితి..!!

actress Urvashi Rautela gets injured on the sets of NBK109!

Ravi Teja trolled for romancing a heroine half his age!