మోస్ట్ వాంటెడ్ పాన్ ఇండియా సినిమాగా తెరకెక్కుతున్న ‘పుష్ప-2’ మూవీ వాయిదాల మీద వాయిదాలు పడుతోంది. నిజానికి బాహుబలి సినిమాకి కూడా జక్కన్న ఇంత టైం తీసుకోలేదేమో అంటున్నారు. తీసిందే తీసి, రీషూట్ చేస్తూ మనీ, టైం రెండు వేస్ట్ చేస్తున్నాడని నిర్మాతలకి కూడా ఇది పెను భారంగా మారుతోంది అని సమాచారం. పుష్ప 2 అనుకున్న టైం కి రాకపోవటం వలన పెట్టిన మొత్తానికి వడ్డీలు పెరిగి నిర్మాతలకి 40 కోట్ల నష్టం వచ్చిందని ఫిలిం నగర్ టాక్.
దీనివల్ల సుకుమార్ కి కూడా చెడ్డ పేరు వస్తోంది. పుష్ప సినిమాతో పాన్ ఇండియా దర్శకుడి అవతారం ఎత్తి, పలువురి దృష్టిలోపడిన సుకుమార్ ఏంటి ఇలా చేస్తున్నాడు, వచ్చిన పేరు మొత్తం పాడు చేసుకుంటున్నాడు అని విమర్శలు వినిపిస్తున్నాయి. క్వాలిటీ అని పట్టుబట్టి కూర్చుంటే, మార్పులు మీద మార్పులు చేస్తూ కూర్చుంటే ఖర్చు తడిసి మోపెడు అవుతోంది. నిర్మాతలని కూడా దృష్టిలో పెట్టుకోవాలి కదా సుక్కు సర్. ఇలా అయితే నెక్స్ట్ ప్రాజెక్ట్ కి నిర్మాతలు దొరకటం కష్టమే అంటున్నారు సినీప్రియులు..!!