in

Ranbir Kapoor Sai Pallavi ‘Ramayan’ becomes India’s most expensive film!

ణ్‌బీర్‌ కపూర్‌ రాముడిగా..యశ్‌ రావణుడిగా..సాయిపల్లవి సీతగా నితేశ్‌ తివారీ తెరకెక్కిస్తున్న పురాణేతిహాసం ‘రామాయణ’. భారీ తారాగణంతో నిర్మిస్తున్న ఈ చిత్రం భారతీయ సినీ పరిశ్రమలోనే టాక్‌ ఆఫ్‌ ది టౌన్‌గా మారిన విషయం తెలిసిందే. ఇంకా అధికారికంగా సినిమాని ప్రకటించకుండానే చిత్రీకరణ మొదలుపెట్టారు. ఇప్పుడీ సినిమా బడ్జెట్ గురించి ఓ ఆసక్తికరమైన విషయం తెలిసింది.

రామాయణని ఫ్రాంచైజీగా ప్లాన్ చేస్తున్న మేకర్స్.. తొలి భాగాన్ని దాదాపు రూ. 835 కోట్ల బడ్జెట్‌తో రూపొందిస్తున్నారనే టాక్ వినిపిస్తోంది. రూ. 835 కోట్లు అంటే ఇండియన్ సినిమాలో ఆల్ టైమ్‌ హయ్యస్ట్ బడ్జెట్ మూవీ అవుతుంది. రామాయణం దృశ్య కావ్యం. ఇప్పటికే రామకథపై అనేక చిత్రాలు వచ్చాయి. అయితే నితేష్ తివారీ మాత్రం వరల్డ్ క్లాస్ విజువల్స్ ఎఫెక్ట్స్ తో సినిమా ప్లాన్ చేస్తున్నాడు. దాదాపు రెండేళ్ళ సమయం పోస్ట్ ప్రొడక్షన్ పనులకే పడుతుందని తెలుస్తోంది..!!

family star defames mrunal thakur in youth audience!

janhvi kapoor: i felt sexualized by the media when I was 13 years old