మూవీ మొఘుల్ రామ నాయుడు గారు నిర్మించిన భారీ బడ్జెట్ చిత్రం “ప్రేమ నగర్”. చిత్రం విడుదలకు ముందు పబ్లిసిటీ పోస్టర్స్, కట్ ఔట్స్ కూడా చాల డిఫరెంట్ గ డిజైన్ చేయించారు రామ నాయుడు గారు. తెలుగు నాట ఆ పోస్టర్స్ గురించి పెద్ద చర్చ జరిగింది. విషయం చెవిన పడిన ఆ చిత్ర కథానాయకి ఆ పోస్టర్స్ చూడాలని చాల ముచ్చట పడ్డారు, దాని కోసం చాల సాహసం చేయ వలసి వచ్చింది. ఆచిత్రం విడుదల సమయానికి వేరే ఏదో చిత్రం షూటింగ్ కోసం హైదరాబాద్ వచ్చిన వాణిశ్రీ గారు, ఆ పోస్టర్స్ చూడటానికి మూవీ రిలీజ్ అవుతున్న థియేటర్ దగ్గరకు ఒంటరిగా కారులో వెళ్లారు..
ఆవిడ అక్కడకు చేరుకొనే సరికి అప్పటికే జనం భారీగా గుమికూడి ఉన్నారు, ప్రమాదాన్ని పసిగట్టిన డ్రైవర్ కార్ ని వేగంగా పోనించి అక్కడ నుంచి తప్పించుకొని వచ్చేసారు. అయినా పట్టు వదలని వాణిశ్రీ గారు నెక్స్ట్ డే ఎర్లీ మార్నింగ్ థియేటర్ దగ్గరకు వెళ్లి అందరు అంత గ మెచ్చుకుంటున్న పోస్టర్స్, కట్ ఔట్స్, చూసి మురిసి పోయారు. నటి, నటులు చిన్న, చిన్న కోరికలు తీర్చుకోవటాని కూడా చాల సాహసమే చేయవలసి వస్తుంది, తెలుగునాట వారికున్న అభిమాన గణం అటువంటిది మరి ఇప్చ్ ఏం చేద్దాం?, ప్రేక్షకులే వారి పాలిట దేవుళ్ళు, శృతి మించితే వారే, వారి పాలిట ???????