నాగబాబు వ్యాఖ్యలపై నెటిజెన్స్ ఫైర్ అయ్యారు. దీంతో తాను చేసిన వ్యాఖ్యల్లో తప్పు ఉందని గ్రహించిన నాగబాబు ట్విట్టర్ వేదికగా స్పందించారు. ఇటీవల జరిగిన వరుణ్ తేజ్ ఆపరేషన్ వాలెంటైన్ ఫ్రీ రిలీజ్ ఈవెంట్ లో నేను పోలీస్ క్యారెక్టర్ ఆరు అడుగుల మూడు అంగుళాలు ఉండే వ్యక్తులు చేస్తే బాగుంటుందని ఐదు అడుగులు..
మూడు అంగుళాలు వ్యక్తులు చేస్తే బాగోదు అన్నట్లుగా మాట్లాడను. ఆ మాటలు వెనక్కి తీసుకుంటున్నానని నాగబాబు అన్నారు. ఎవరైనా ఆ మాటలకి నొచ్చుకుని ఉంటే క్షమించాల్సిందని కోరారు. అలానే అవి యాదృచ్ఛికంగా వచ్చిన మాటలే కానీ కావాలన్న మాటలు కాదని అందుకు అర్థం చేసుకుని క్షమిస్తారని ఆశిస్తున్నానని నాగబాబు పోస్ట్ చేశారు..!!