త్వరలో వాలెంటెన్స్ డే ఉండడంతో తనకు వచ్చిన మొట్టమొదటి లవ్ లెటర్ గురించి ఆసక్తికరమైన వ్యాఖ్యలు చేసింది. ఇండస్ట్రీకి వచ్చిన కొత్తలో షాపింగ్ మాల్ కార్యక్రమానికి వెళ్లాను. నేను వెళ్లే కంటే ముందే అందరికీ తెలిసిపోవడంతో అక్కడ చాలామంది వచ్చారు. అందులో నేను నిలబడి ఉండగా గుంపు లోంచి ఓ అబ్బాయి వచ్చి నాకు పుస్తకం ఇచ్చాడు. దాని ఇంటికి తీసుకెళ్లాక ఏముంది అని అందులో చూస్తే..
అందులో నా ఫోటోలు లెటర్ ఉంది. నేను దాన్ని చదివాను అందులో తనను పెళ్లి చేసుకోవాలని అడ్రస్ తో సహా ఫోటో, ఫోన్ నెంబర్ కూడా రాసి ఇచ్చాడు. అవన్నీ చూసాక ఒక్కసారి షాక్ అయ్యాను. కానీ ఆ తర్వాత నవ్వుకున్నాను. నాకు కాలేజీ రోజుల్లో కూడా లవ్ లెటర్స్ రాలేదు. అతని రాసిందే నా మొట్టమొదటి లవ్ లెటర్ ఇప్పటికి దాన్ని చాలా భద్రంగా దాచుకున్నాను అంటూ ఆసక్తికరమైన వ్యాఖ్యలు చేసింది..!!