సెలబ్రిటీలు బాధ్యతతో వ్యవహరించకుండా కేవలం ఇలాంటి వాటివల్ల తమకు వచ్చే డబ్బుల గురించి మాత్రమే ఆలోచిస్తున్నారు. చాలామంది షార్ట్ వీడియోల ద్వారా బెట్టింగ్ యాప్ లను ప్రమోట్ చేస్తున్నారు. కానీ తమన్నా మాత్రం ఏకంగా ఒక యాడ్ లో కనిపించడం, పైగా ఆ యాడ్ లో లోటస్ 365 బెట్టింగ్ యాప్ ద్వారా మంచి టైం పాస్ తో పాటు డబ్బులు కూడా సంపాదించుకోవచ్చనీ, 50 వేల వరకు డిపాజిట్ చేసిన వాళ్లకు 50 నుంచి 400 శాతం బోనస్ వస్తుందని..
లోటస్ 365 యాప్ లో కేసినో ఆడమంటూ తమన్నా ప్రోత్సహించింది. తమన్నా ఈ యాప్ కు ప్రచారం చేయడం ఇదే మొదటిసారి కాదు. గత ఏడాది మేలో లోటస్ 365 ప్రమోషనల్ వీడియోలో పాల్గొంది. అలాగే మరో బ్యాన్ చేసిన బెట్టింగ్ ప్లాట్ ఫామ్ ఫెయిరీ ప్లేకి ప్రచారం చేయడమే కాకుండా, సోషల్ మీడియాలోనూ పోస్ట్ చేసింది. ఇంస్టాగ్రామ్ లో 24 మిలియన్లకు పైగా ఫాలోవర్లు ఉన్న తమన్నా ఇలా బాధ్యత లేకుండా బ్యాన్ చేసిన యాప్ లను ప్రచారం చేయడం ఇప్పుడు వివాదాస్పదంగా మారింది..!!