in

chowdary’s girl role only for few minutes!

నిన్నటి వరకు మీనాక్షి చౌదరి పాత్రకు ఈ మూవీలో పెద్దగా ప్రాధాన్యత లేదు అంటూ ప్రచారం జరిగింది. ఆ వార్తలను నిజం చేసేలా సినిమా ప్రమోషన్స్ లో మీనాక్షి ప్రస్తావన పెద్దగా లేదు. జనవరి 9న గుంటూరులో జరిగిన “గుంటూరు కారం” మూవీ ప్రీ రిలీజ్ ఈవెంట్ లో మహేష్ బాబు మాట్లాడుతూ ఈ సినిమాలో మీనాక్షి అతిధి పాత్రలో నటిస్తోందని, డైరెక్టర్ త్రివిక్రమ్ శ్రీనివాస్ అడిగిన వెంటనే ఆమె ఒప్పుకున్నందుకు కృతజ్ఞతలు తెలిపాడు. దీంతో ఇప్పటిదాకా మీనాక్షి ఆటలో అరటిపండు అని భావిస్తున్న వాళ్ల ఒపీనియన్ నిజమైంది.

మరి ఈ విషయం తెలిసిన తర్వాత మహేష్ బాబు సరసన నటించే అవకాశం దక్కినందుకు సంతోష పడాలా? లేదంటే కేవలం అతిథి పాత్రలో కనిపించబోతున్నందుకు బాధపడాలో అర్థం కాని స్థితిలో ఉన్నారు మీనాక్షి అభిమానులు. కానీ మీనాక్షి చౌదరి మాత్రం తనకు ఈ సినిమాలో అవకాశం వచ్చినప్పుడు చాలా సంతోషపడ్డాను అంటూ, త్రివిక్రమ్ పాపులర్ డైలాగ్ ఈ సినిమాలో ఛాన్స్ వచ్చింది అని తెలియగానే జేబులో చేతులు పెట్టుకొని అలా వెళ్ళిపోయాను అంటూ ఆనందాన్ని వ్యక్తం చేసింది..!!

‘thaata oodipothundi’, mahesh babu compliments sreeleela dance!

Tamannaah is under fire for promoting banned betting app!