in

‘thaata oodipothundi’, mahesh babu compliments sreeleela dance!

టాలీవుడ్ లో మోస్ట్ వాంటెడ్ హీరోయిన్లలో టాప్ ప్లేస్ లో ఉన్న శ్రీలీలకు ఎల్లుండి పెద్ద పరీక్షే ఎదురుకానుంది. మొదటిసారి సూపర్ స్టార్ మహేష్ బాబుతో జోడి కట్టిన గుంటూరు కారం భారీ అంచనాలతో విడుదలవుతోంది. అభిమానులే కాదు సగటు ప్రేక్షకులు కూడా దీని మీద విపరీతమైన ఆసక్తితో ఎదురు చూస్తున్నారు.

నిన్న జరిగిన ప్రీ రిలీజ్ ఈవెంట్ లో ఏకంగా సూపర్ స్టారే స్టేజి మీద వేలాది మంది చూస్తుండగా, కోట్లాది మంది టీవీ, ఆన్ లైన్ లో వీక్షిస్తుండగా శ్రీలీలతో డాన్స్ చేస్తే హీరోలకు తాట ఊడిపోతుందని చెప్పడం కన్నా గొప్ప కితాబు ఇంకేముంటుందని ఫ్యాన్స్ మురిసిపోతున్నారు. మాములుగా మహేష్ తన ఈవెంట్లలో హీరోయిన్లను మెచ్చుకోవడం సహజమే కానీ మరీ ఇంత ఎలివేషన్ గతంలో ఎప్పుడూ ఇవ్వలేదు..!!

Bigg Boss Fame Ashwini Sree Opens Up About Her Future Husband!

chowdary’s girl role only for few minutes!