బిగ్ బాస్ బ్యూటీ అశ్విని శ్రీ..తనకు ఎలాంటి బాయ్ ఫ్రెండ్ కావాలో చెప్పుకొచ్చింది. గేమ్ పెద్దగా ఆడకపోయినా..గ్లామర్ షో మాత్రం చక్కగా చేసింది. వారంలో ఎలిమినేట్ అయ్యి బయటకు వచ్చింది. అయితే ఎన్నో ఏళ్లుగా ఇండస్ట్రీలో ఉన్నా.. అన్ లిమిటెట్ అందాలను ఆరబోస్తూ గ్లామర్ షో చేసినా..బికినీ తో కాకరేపే వీడియోలు వదిలినా రాని గుర్తింపు బిగ్ బాస్ షోతో రాబట్టింది అశ్విని శ్రీ..
అయితే రీసెంట్ గా తను సింగిల్ అని రెడీ టు మిగింల్ అని ఆఫర్ ఇచ్చింది. అంతేకాదు..తనకి కాబోయే వాడిలో ఎలాంటి క్వాలిటీస్ ఉండాలో కూడా చెప్పింది. ‘‘నన్ను చేసుకోబోయేవాడు అందంగా ఉండాలనేం లేదు. మంచి హార్ట్ ఉంటే చాలు. నాకు ఎంత నల్లగా ఉన్నా.. చూడ్డానికి ఎంత చెండాలంగా ఉన్నా పర్లేదు. వాడి గుణం మంచిదైతే చాలు. ఇవి ఉంటే చాలు. నా మనసుకి నచ్చాలి కదా. అందుకే చెప్తున్నానంటు డైరక్ట్ గా కుర్రాళ్లకు ఆఫర్ ఇచ్చింది ఈ భామ..!!