పేరులో నేమున్నది అని చాల మంది లైట్ తీసుకోవచ్చు కానీ, అంత పేరులోనే ఉన్నది, పేరు అనేది మన మొదటి ఆధార్ కార్డు వంటిది, ఒకే పేరుతో ఒకే రంగం లో ఇద్దరు ఉన్నారు అనుకోండి, వారు పడే ఇబ్బందులు చెప్పను అలవి కావు. ఉదాహరణ కు సినీ నటుడు గిరి బాబు, సినీ రంగ ప్రవేశం చేసిన కొత్తల్లో అదే పేరుతో, రాజమండ్రి కి చెందిన ఒక వ్యక్తి నిర్మాతగా సినీ రంగ ప్రవేశం చేసారు. ఆయన జయంతి హీరోయిన్ గ “చందన” అనే సినిమా నిర్మించారు, ఆ షూటింగ్లో ఇద్దరి మనసులో కలవడం తో నిర్మాత గిరి బాబు గారు జయంతి గారిని వివాహం చేసుకున్నారు. ఆయన గురించి సినీ రంగం లో కొంత మందికి తెలిసినప్పటికీ, పబ్లిక్ లో ఎవరికి తెలియదు, దానితో నటుడు గిరి బాబు గారే జయంతి గారిని రెండో వివాహం చేసుకున్నారు అని చాల వేగంగా ప్రచారం జరిగిపోయింది. ఆ గిరి బాబు ను నేను కాదు మొర్రో అని నటుడు గిరి బాబు ఎంత మొత్హుకున్న వినే వారు కరువు అయ్యారు..
చివరకు గిరి బాబు గారి సొంత ఊరిలో కూడా గిరి బాబు రెండవ వివాహం చేసుకున్నారు అని నమ్మి గిరి బాబు గారి భార్యకు సానుభూతి ఉత్తరాలు వచ్చేవి. ఒక రోజు షూటింగ్ గ్యాప్ లో ప్రక్కన వచ్చి కూర్చున్న సూర్యకాంతం గారు ఒరే నాయన, చేసుకుంటే చేసుకున్నావు గాని జయంతిని బాగా చూసుకో అది అసలే అమాయకపు పిల్ల , అంటూ మొదలు పెట్టేసరికి, అలాగే పెద్దమ్మ మీ జయంతిని పువ్వుల్లో పెట్టి చూసుకుంటాను అంటుండగా అక్కడికి వచ్చిన విజయ నిర్మల, జయప్రద గారు ఏమిటి విషయం అని అడిగారట. విషయం తెలుసుకున్న విజయ నిర్మల గారు జయంతి ని వివాహమాడింది ఈ గిరి బాబు కాదు అని సూర్యకాంతం గారి తో చెప్పారట. మరేమిటి ఈ బడుద్దాయి పువ్వుల్లో పెట్టి చూసుకుంటాను అంటున్నాడు మరి అని, గిరి బాబు ను వెంటపడి షూటింగ్ స్పాట్ అంత తరిమారట. ఏక నామధేయం తో ఇటువంటి ఇబ్బందులో కొన్ని ఉంటాయి మరి, ఏమంటారు..!!