రష్మిక మందన్న, కత్రినా కైఫ్, కాజోల్ తర్వాత అలియా భట్ డీప్ ఫేక్ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. అలియా ముఖంతో మార్ఫింగ్ చేసిన వీడియో అన్ని సోషల్ మీడియా ప్లాట్‌ఫారమ్‌లలో వైరల్ అవుతోంది. ఇది ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ వినియోగంపై ఆందోళనలను మరింత పెంచుతోంది. ఈ వీడియోలో అలియా భట్ ముఖం వేరే మహిళ మీద ఉంచారు. డీప్‌ఫేక్ గురించి ఇటీవలి కాలంలో చాలా చర్చ జరుగుతూ ఉండగా..
ఇప్పుడు అలియా భట్ కు సంబంధించిన మానిప్యులేట్ వీడియో ఆన్లైన్లో కనిపించింది. నీలిరంగు దుస్తులు ధరించిన ఒక అమ్మాయి కెమెరా ముందు ఉండడాన్ని వీడియోలో చూడొచ్చు. రష్మిక మందన్నా సంబంధించిన డీప్‌ఫేక్ వీడియో ఇటీవల వైరల్ అయిన విషయం తెలిసిందే. జారా పటేల్ అనే ఓ సోషల్ మీడియా ఇన్‌ఫ్లూయెన్సర్‌కి సంబంధించిన వీడియోకి రష్మిక ముఖాన్ని మార్ఫింగ్ చేసి సోషల్ మీడియాలో పోస్టు చేయడంతో అదికాస్తా వైరల్‌గా మారింది..!!