జొన్నలగడ్డ చైతన్యను పెళ్లి చేసుకున్న నిహారిక, ఇటీవల డివోర్స్ తీసుకుని అతని నుంచి దూరమైంది. ఇక అప్పటి నుంచి ఆమె ఏం చేసినా, నిహారికకు సంబంధించిన ఏ విషయమైనా జనాలు ట్రోల్ చేస్తున్నారు. ఈ క్రమంలోనే నిహారిక ఒక బ్లాక్ బస్టర్ హిట్ మూవీని చేజార్చుకుందని వార్తలు వినిపిస్తున్నాయి. అక్కినేని నాగచైతన్య హీరోగా, తమన్నా హీరోయిన్ గా నటించిన రొమాంటిక్ అండ్ ఫ్యామిలీ ఎంటర్టైన్ మూవీ “100% లవ్”.
సుకుమార్ డైరెక్ట్ చేసిన ఈ సినిమా బాక్స్ ఆఫీస్ రికార్డ్స్ బ్రేక్ చేసిన విషయం తెలిసిందే. అయితే ఈ మూవీలో ముందుగా మెగా డాటర్ నిహారికను హీరోయిన్ గా తీసుకోవాలని మేకర్స్ అనుకున్నారట. కానీ అప్పటికి నిహారికకు టాలీవుడ్లో ఎంట్రీ ఇచ్చే ఆలోచన లేదట. మెగా ఫ్యామిలీ కూడా దీనికి ఒప్పుకోలేదట. ఇంకేముంది ఆ అద్భుతమైన ఛాన్స్ మిల్కీ బ్యూటీ తమన్నాకు వెళ్ళిపోయింది. ఒకవేళ ఈ సినిమాతో గనక మెగా డాటర్ డెబ్యూ ఇచ్చి ఉంటే, ఇప్పుడు నిహారిక టాలీవుడ్ లో మంచి పొజిషన్లో ఉండేది అని అంటున్నారు మెగా ఫ్యాన్స్..!!