అలనాటి స్టార్ హీరోయిన్ సారిక – కమల్ హాసన్ దంపతులకు శృతిహాసన్ జన్మించిన విషయం తెలిసిందే. సతీమణి సారిక రీసెంట్ గ్స్ ఓ ఇంటర్వ్యూలో చేసిన కామెంట్స్ ఇప్పుడు వైరల్ అవుతున్నాయి. ఆ ఇంటర్వ్యూలో సారిక మాట్లాడుతూ తన పెద్ద కుమార్తె తనను దూరం పెట్టిందని, తన దగ్గరికి రావడం పూర్తిగా మానేసిందని, ఆ సమయంలోనే లాక్ డౌన్ కూడా విధించారని తెలిపింది. అయితే అప్పుడు తనకు తినడానికి తిండి కూడా లేదనీ, చేతిలో రూపాయి కూడా లేని..పరిస్థితి నెలకొనడంతో తాను కమల్ హాసన్ కు కాల్ చేస్తే, అసలు పట్టించుకోలేదంటూ షాకింగ్ విషయాలను వెల్లడించింది.
ఇప్పటికీ కూడా సారిక ముంబైలో రూమ్ రెంట్ కట్టుకుంటూ ఒంటరిగా తన జీవితాన్ని గడుపుతున్నట్టుగా తెలుస్తోంది. ‘సలార్’ రిలీజ్ నేపథ్యంలో సారిక ఇచ్చిన ఈ ఇంటర్వ్యూ ఇప్పుడు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. ఇక ఈ వీడియోని చూసిన నెటిజన్లు ఎంత పెద్ద స్టార్ హీరోయిన్ అయితే ఏం లాభం, ఇలా దిక్కుతోచని స్థితిలో ఉన్న కన్నతల్లిని పట్టించుకోవట్లేదు అంటే ఆమె అభిమానిగా ఉండడం సిగ్గుచేటు అంటూ శృతిహాసన్ ను ఏకిపారేస్తున్నారు. ఇక కొంతమంది మాత్రం ఇలాంటి పరిస్థితిలో తల్లిని దూరం పెట్టడం కరెక్ట్ కాదని, ఆమెను కూడా శృతి తన దగ్గరే ఉంచుకోవడం మంచిదని సలహాలు ఇస్తున్నారు. శృతిహాసన్ ఈ విషయంపై ఎలా స్పందిస్తుందో చూడాలి..!!