అక్కినేని నాగచైతన్య, సమంత.. ఒకప్పుడు భార్యాభర్తలు. విడాకుల తర్వాత ఇద్దరూ ఎవరి దారి వారు చూసుకున్నారు. సమంత తన కెరీర్‌లో బిజీ అయిపోయింది. నాగచైతన్య సంగతి సరే సరి. ఇద్దరూ కలిసి నటించాల్సి వస్తే.? ఈ ప్రశ్నకు ఇరువురూ ‘ఏం, ఎందుకు చేయం.?’ అంటూ పలు సందర్భాల్లో విడివిడిగా ఎదురు ప్రశ్నించారు. కానీ, ఈ ఇద్దర్నీ ఒకే ఫ్రేమ్‌లో చూపించేందుకు ఏ దర్శకుడూ ప్రయత్నించడంలేదు. అయితే, ఓ యంగ్ డైరెక్టర్ అటు సమంతనీ, ఇటు నాగచైతన్యనీ ఓ ప్రాజెక్టు కోసం ఒప్పించాడట.
అయితే, అది వెబ్ సిరీస్ అని అంటున్నారు. ఓ ప్రముఖ ఓటీటీ, ఈ వెబ్ సిరీస్‌ని నిర్మించనున్నట్లు తెలుస్తోంది. వాస్తవానికి, ఈ ప్రాజెక్టు గతంలోనే సెట్స్ మీదకు వెళ్ళాల్సి వుంది. అనివార్య కారణాల వల్ల ఆలస్యమయ్యిందని చెబుతున్నారు. ఎప్పుడు సెట్స్ మీదకు వెళుతుందన్నదానిపై ఇంకాస్త స్పష్టత రావాల్సి వుంది. కాగా, అనారోగ్యం బారిన పడ్డ సమంత, ప్రస్తుతం పూర్తిగా కోలుకునేందుకు తగినంత విశ్రాంతి తీసుకుంటోంది. బ్యాక్ టు బ్యాక్ డిజాస్టర్ సినిమాలు చేసిన సమంత, మంచి బ్రేక్ కోసం ఎదురుచూస్తున్న సంగతి తెలిసిందే. సమంత రీసెంట్ మూవీ అంటే, అది ‘ఖుషీ’.!!