మొదటగా శుభమన్ సచిన కూతురు సారాతో ప్రేమలో ఉన్నట్లు వార్తలొచ్చినా.. మధ్యలో వీరిమధ్య భేదాభిప్రాయాలతో విడిపోయారని..ఆ తర్వాత శుభమన్-సారా అలీఖాన్ ఓ హోటల్లో కలిసి భోజనం చేస్తూ కనిపించడంతో ఆ సారాను మర్చిపోలేక ఈ సారాతో డేటింగ్ చేస్తున్నాడంటూ రూమర్స్ వచ్చాయి. అయితే తాజాగా సారా అలీఖాన్ ఈ రూమర్స్ పై క్లారిటీ ఇచ్చింది..
కాఫీ విత్ కరణ్ షోలో పాల్గొన్న సారా..శుభమన్తో డేటింగ్ చేస్తున్న సారా తాను కాదని అసలు సంగతి చెప్పుకొచ్చింది. ‘‘సారా అనగానే మీరు తప్పుగా అర్థం చేసుకుంటున్నారు. ఈ ప్రపంచం మొత్తం రాంగ్ సారా వెనుక పడుతోంది’’ అని తెలిపింది. సారా అలీఖాన్ కామెంట్స్ ప్రస్తుతం నెట్టింట ట్రెండ్ అవుతున్నాయి. శుభ్‌మన్‌తో తాను ప్రేమలో లేనట్టు చెబుతూనే.. సచిన్ కుమార్తె సారా – గిల్ రిలేషన్‌లో ఉన్నారంటూ సారా హింట్ ఇచ్చిందంటూ నెటిజన్లు కామెంట్స్ చేస్తున్నారు..!!